Heavy Rains: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు

ఝార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌పై సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడి నైరుతి దిశకు తిరిగింది.

Updated : 05 Jul 2022 07:03 IST

ఈనాడు, హైదరాబాద్‌-బెజ్జూరు, న్యూస్‌టుడే: ఝార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌పై సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడి నైరుతి దిశకు తిరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. ఆదివారం ఉదయం 8.30 నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల వరకు అత్యధికంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 13.2 సెంటీమీటర్లు, పాతరాజంపేట(కామారెడ్డి)లో 12.8, పొచ్చెర(ఆదిలాబాద్‌)లో 10.4. నెన్నెల(మంచిర్యాల)లో 9.7, సోనాల(ఆదిలాబాద్‌)లో 9.4, జైనూర్‌(ఆసిఫాబాద్‌)లో 9.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా హైదరాబాద్‌ నగరంతోపాటు సంగారెడ్డి, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు అధికంగా కురిశాయి. నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 686 అడుగులకు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని