GHMC: మొదటి 100 మందిపై దృష్టి పెట్టండి: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

నగరంలో ఆస్తి పన్ను వసూళ్లపై గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ప్రత్యేక దృష్టి సారించింది.

Published : 22 Dec 2023 21:43 IST

హైదరాబాద్: నగరంలో ఆస్తి పన్ను వసూళ్లపై గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ప్రత్యేక దృష్టి సారించింది. ఆస్తి పన్ను వసూళ్ల పురోగతిపై జోనల్ కమిషనర్లు, ఏఎంసీలతో సమీక్ష నిర్వహించిన కమిషనర్‌ రొనాల్డ్‌ రోస్‌.. ఆస్తి పన్ను వసూలు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పన్ను చెల్లించకుండా ఉన్న మొదటి 100 మందిపై దృష్టి సారించి మొండి బకాయిలను వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి లోగా పన్ను వసూళ్లు పూర్తి చేయాలన్నారు. నిత్యం బిల్ కలెక్టర్లతో జోనల్ కమిషనర్లు సమీక్షించాలని కమిషనర్‌ ఆదేశించారు. ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో జీహెచ్‌ఎంసీ ఉన్నందున.. పన్ను వసూళ్లను అధికారులు అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని కమిషనర్ ఆదేశించినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని