Hyderabad: సచివాలయ ప్రాంగణంలో గుడి, చర్చి, మసీదును ప్రారంభించిన గవర్నర్‌, సీఎం

సచివాలయం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన నల్లపోచమ్మ ఆలయంతో పాటు మసీదు, చర్చిని గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. సచివాలయానికి నైరుతిలో అమ్మవారితో పాటు శివాలయం, ఆంజనేయస్వామి ఆలయాలను నిర్మించారు.

Updated : 25 Aug 2023 13:57 IST

హైదరాబాద్: సచివాలయం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన నల్లపోచమ్మ ఆలయంతో పాటు మసీదు, చర్చిని గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. సచివాలయానికి నైరుతిలో అమ్మవారితో పాటు శివాలయం, ఆంజనేయస్వామి ఆలయాలను నిర్మించారు. ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన, విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన మహా పూర్ణాహుతి, మహా మంగళహారతి కార్యక్రమాల్లో తమిళిసై, కేసీఆర్‌ పాల్గొన్నారు. అనంతరం చర్చి, మసీదును ప్రారంభించారు. చర్చిలో గవర్నర్‌, సీఎం కేక్‌ కట్‌ చేశారు. ఆ తర్వాత మసీదును ప్రారంభించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని