Andhra News: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు అనుమతి.. విధివిధానాలు ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బదిలీలకు సంబంధించిన విధివిధానాలను తెలియజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒకే చోట ఐదేళ్లు...

Updated : 07 Jun 2022 15:56 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బదిలీలకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారు బదిలీలకు అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది.

రాష్ట్రంలో సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఉత్తర్వులపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంతకం చేశారు. దీంతో ఉద్యోగుల సాధారణ బదిలీలపై అడ్డంకులు తొలిగిపోయినట్లు అయింది. జూన్‌ 17లోపు బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బదిలీలకు సంబంధించిన విధివాధానాలను ఖరారు చేస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మార్గదర్శకాలు ఇవే..

* 40శాతం కంటే అధిక వైకల్యం ఉన్న ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యం.

* మానసిక వైకల్యం గల పిల్లలున్న ఉద్యోగులకు ప్రాధాన్యం.

* కుటుంబీకులు దీర్ఘకాల వ్యాధులతో బాధపడితే బదిలీల్లో ప్రాధాన్యం.

* కారుణ్య నియామకాల కింద నియమితులైన వితంతువులకు ప్రాధాన్యం.

* వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసే దంపతులకు బదిలీల్లో ప్రాధాన్యం.

* జూన్‌ 18 నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఆదేశాలు జారీ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని