ఈ సిటీల్లో 70+ అంతస్తుల భవంతులు కట్టొచ్చు!
గుజరాత్‌లోని ప్రధాన నగరాల్లో ఆకాశహర్మ్యాలను తాకే భారీ ఎత్తైన బహుళ అంతస్తుల భవనాలు ఇకపై దర్శనమివ్వనున్నాయి. 70 అంతకన్నా ఎక్కువ అంతస్తున్న భవంతుల నిర్మాణానికి సీఎం........
గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఆమోదముద్ర
గాంధీనగర్: గుజరాత్‌లోని ప్రధాన నగరాల్లో ఆకాశహర్మ్యాలను తాకే ఎత్తైన బహుళ అంతస్తుల భవనాలు ఇకపై దర్శనమివ్వనున్నాయి. 70 అంతకన్నా ఎక్కువ అంతస్తులు ఉన్న భవంతుల నిర్మాణానికి సీఎం విజయ్ రూపానీ మంగళవారం ఆమోద ముద్రవేశారు. రాష్ట్రంలోని ఐదు నగరాల్లో మాత్రమే ఇలాంటి ఎత్తైన భవనాల నిర్మాణానికి అనుమతించనున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం గరిష్ఠంగా 23 అంతస్తుల ఎత్తు వరకు మాత్రమే భవనాల నిర్మాణాలకు అనుమతులు ఉండగా.. తాజాగా అంతకు దాదాపు మూడు రెట్లకు పైగా ఎత్తైన భవనాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వనుంది. ఇందుకోసం జనరల్ డెవలప్మెంట్ కంట్రోల్ రెగ్యులేషన్ చట్టానికి సవరణలు తేవాలని సీఎం నిర్ణయించినట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
అనుమతులు ఈ నగరాలకే..
అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్‌కోట్, గాంధీనగర్‌లలో మాత్రమే 70కి పైగా అంతస్తులతో ఎత్తైన భవనాలు నిర్మాణం చేపట్టుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఆకాశాన్ని తాకే ఇలాంటి భవనాలకు అనుమతులకు సంబంధించిన కొత్త నిబంధనలు 100 మీటర్ల ఎత్తుకన్నా అధికంగా ఉండే నిర్మాణాలకు వర్తించనున్నాయి. ఇలాంటి ప్రాజెక్టులకు అనుమతిచ్చేందుకు వీలుగా ప్రత్యేక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త నిబంధనలు ఇళ్ల ధరలు తగ్గించడంలో దోహదపడతాయని సీఎం రూపానీ విశ్వాసం వ్యక్తంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
భానుడి వేడి..దొరకని నాడి
లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇంకా పట్టణ ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
సాంకేతిక జోరు.. అరచేతిలో హోరు
ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింట ప్రచారం.. ఇదంతా ఎన్నికల ప్రచారంలో ఒక ఎత్తు. ప్రస్తుతం అభ్యర్థులు తమ ప్రచారం ఎక్కువ మందికి చేరేందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు. -
జగనన్న.. భూభక్ష చట్టం
ఇసుక అక్రమంగా తవ్వారు.. మట్టినీ దోచుకున్నారు.. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేశారు. వీటన్నింటినీ ఖాళీ చేశారు. ఇప్పటికే కనిపించిన ఖాళీ జాగాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వైకాపా నేతల కన్ను ప్రజల స్థలాలపై పడింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్‌కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్‌కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?