Guntur: గుంటూరులో డయేరియా మరణాలు.. స్పందించిన జిల్లా న్యాయసేవాధికార సంస్థ

నగరంలో డయేరియా మరణాలపై జిల్లా న్యాయసేవాధికార సంస్థ స్పందించింది. ఈ మేరకు లీగల్‌ సర్వీస్‌ అథారిటీ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి టి.లీలావతి జీజీహెచ్‌లో బాధితులతో మాట్లాడారు. 

Updated : 19 Feb 2024 23:08 IST

గుంటూరు: నగరంలో డయేరియా మరణాలపై జిల్లా గుంటూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ స్పందించింది. లీగల్‌ సర్వీస్‌ అథారిటీ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి టి.లీలావతి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి వారితో మాట్లాడారు. అనంతరం వారికి అందుతున్న చికిత్స, అనారోగ్యానికి గల కారణాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గత పదిరోజులుగా గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల ప్రజలు కలుషిత నీరు తాగి వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇందులో నలుగురు డయేరియా అనుమానిత లక్షణాలతో మృతి చెందారు. దీంతో నగరపాలక సంస్థ సరఫరా చేసే నీటిని తాగడానికి ప్రజలు భయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు