Cyclone Asani: ఆంధ్రప్రదేశ్‌పై ‘అసని’ తుపాను ప్రభావం..!

అసని తుపాను ఆంధ్రప్రదేశ్‌ సహా భారత్‌లోని పలు రాష్ట్రాలపై ప్రభావం చూపించనుంది. మంగళవారం నుంచి ఒడిస్సా, పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌ల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని

Published : 08 May 2022 12:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అసని తుపాను ఆంధ్రప్రదేశ్‌ సహా భారత్‌లోని పలు రాష్ట్రాలపై ప్రభావం చూపించనుంది. మంగళవారం నుంచి ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌ల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భువనేశ్వర్‌లోని వాతావరణ శాఖ కార్యాలయం హెచ్చరించింది. వచ్చే 24 గంటల్లో ఈ తుపాను మరింత బలపడవచ్చవని అంచనావేసింది. ఆంధ్ర లేదా ఒడిశా తీరాలను ఇది తాకే అవకాశం ఉందని పేర్కొంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి బలపడి తుపానుగా మారి వాయువ్య దిశగా గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 970 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. ఆదివారం సాయంత్రం వరకు సాధారణ తుపాను గానే ఉంటుందని.. సోమవారానికి తీవ్రమైన తుపానుగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనావేశారు. మే 10వ తేదీ వరకు ఇలానే కొనసాగా.. ఆతర్వాత బలహీనపడే అవకాశం ఉందన్నారు. గంటకు 80 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని వెల్లడించారు. ఒడిశా, పశ్చిమబెంగాల్‌లోని పలు జిల్లాల్లో అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని