AP High court: ఉత్తరాంధ్రలో సముద్ర కాలుష్యంపై హైకోర్టులో విచారణ

ఉత్తరాంధ్రలో సముద్ర కాలుష్యంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

Published : 31 Jan 2024 18:44 IST

అమరావతి: ఉత్తరాంధ్రలో సముద్ర కాలుష్యంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సముద్రపు నీరు కలుషితమవుతుందని జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ, డాక్టర్‌ రాజేంద్రసింగ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన కమిటీ ఇచ్చిన నివేదిక లోపభూయిష్టంగా ఉందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చల్లా అజయ్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. మురుగునీరు సముద్రంలోకి వెళ్లకుండా జీవీఎంసీ ఆపలేకపోయిందని కమిటీ రిపోర్టులో ఉందని, మురునీటి వల్ల సముద్ర సంపదకు నష్టం వాటిల్లుతోం దని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది అదనపు అఫిడవిట్‌ దాఖలు చేయడంతో తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం ఫిబ్రవరి 14కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని