గన్నవరం ఎయిర్‌పోర్టులో చక్కర్లు కొట్టిన విమానాలు

గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి.

Published : 15 Feb 2024 10:07 IST

అమరావతి: గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. గురువారం ఉదయం ఎయిర్‌పోర్టు పరిసరాల్లో దట్టంగా పొగమంచు కమ్మేయడంతో ల్యాండ్‌ చేయడం సాధ్యం కాలేదు. దీంతో హైదరాబాద్‌, చెన్నై నుంచి గన్నవరం వచ్చిన రెండు విమానాలు గాలిలోనే చక్కర్లు కొట్టాయి. పరిస్థితి అలాగే కొనసాగడంతో హైదరాబాద్‌ ఇండిగో సర్వీసును తిరిగి వెనక్కి పంపించారు. కాసేపటి తర్వాత మంచు ప్రభావం తగ్గడంతో చెన్నై నుంచి వచ్చిన విమానాన్ని ల్యాండ్‌ చేసేందుకు ఎయిర్‌పోర్ట్‌ అధికారులు అనుమతి ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని