IRCTC: ఐఆర్‌సీటీసీలో అకౌంట్‌ లేదా..? ఇలా తెరవండి!

కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో రైల్వేశాఖ ప్రయాణికుల కోసం రైళ్ల సంఖ్యను పెంచుతోంది. ప్రస్తుతం పండగ సీజన్‌ మొదలుకావడంతో ప్రజలు రైళ్లలో సొంతూళ్లకు, విహారయాత్రకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. అయితే, టికెట్‌ బుకింగ్‌ వద్దే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌/యాప్‌లో

Updated : 19 Oct 2021 19:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో రైల్వేశాఖ ప్రయాణికుల కోసం రైళ్ల సంఖ్యను పెంచుతోంది. ప్రస్తుతం పండగ సీజన్‌ మొదలుకావడంతో ప్రజలు రైళ్లలో సొంతూళ్లకు వెళ్తున్నారు. విహారయాత్రలకూ సిద్ధమవుతున్నారు. అయితే, టికెట్‌ బుకింగ్‌ విషయంలోనే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌/యాప్‌లో టికెట్లు బుక్‌ చేసుకునే వీలున్నా.. దాంట్లో ఖాతా లేనిదే కుదరదు. దీంతో టికెట్‌ బుకింగ్‌ ఏజెన్సీలు, ఐఆర్‌సీటీసీ అకౌంట్‌ ఉన్న వారిని ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తోంది. సొంతగా ఖాతా తెరుద్దామంటే దాంట్లో రిజిస్ట్రర్‌ ఎలా అవ్వాలో కొంతమందికి అవగాహన లేదు. ఈ నేపథ్యంలో సొంత ఖాతా తెరిచే విధానాన్ని వీడియోగా రూపొందించి.. సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది ఐఆర్‌సీటీసీ సంస్థ.

ఐఆర్‌సీటీసీలో ఖాతా తెరిచే విధానం ఎలా అంటే..

మొదటగా ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ irctc.co.inను ఓపెన్‌ చేయాలి.

పేజీ పైభాగంలో ఉన్న రిజిస్ట్రర్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

దీంతో రిజిస్ట్రేషన్‌ ఫామ్‌ పేజీ వస్తుంది. అందులో మీరు యూజర్‌ నేమ్‌ ఎంటర్‌ చేయాలి. అది 3 నుంచి 35 క్యారెక్టర్లు ఉండేలా చూసుకోవాలి.

 పాస్‌వర్డ్‌ సెట్‌ చేసుకోవాలి. తర్వాతి కాలమ్‌లో పాస్‌వర్డ్‌ను ధ్రువీకరిస్తూ మరోసారి అదే పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయాలి.

భాషను ఎంచుకోవాలి. (ఐచ్ఛికాలుగా కేవలం ఇంగ్లిష్‌, హిందీ రెండు భాషలు మాత్రమే ఉంటాయి)

ఆ తర్వాత అదనపు భద్రత కోసం సెక్యూరిటీ ప్రశ్నలు అడుగుతుంది. వాటిలో ఒకటి ఎంచుకొని దానికి సమాధానం ఇవ్వాలి. (ప్రశ్న, సమాధానం రెండూ గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడైన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ మరిచిపోయినప్పుడు ఈ ఆప్షన్‌ ద్వారా తిరిగి అకౌంట్‌ వివరాలు పొందొచ్చు) అనంతరం కంటిన్యూ బటన్‌పై క్లిక్‌ చేయాలి. 

ఇప్పుడు మీ వ్యక్తిగత వివరాలైన.. పేరు, పుట్టిన తేదీ, వృత్తి , మొబైల్‌ నంబర్‌, మెయిల్‌ ఐడీ తదితర వివరాలు నమోదు చేయాలి. మళ్లీ కంటిన్యూపై క్లిక్‌ చేయాలి.

ఆ తర్వాత మీ చిరునామాను స్పష్టంగా, పిన్‌కోడ్‌తో సహా నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ చిరునామా ఇంటిదా? ఆఫీస్‌దా? తెలియజేయాలి.

టర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌ను చదివి వాటిని అంగీకరిస్తున్నట్లు దాని పక్కనే ఉన్న బాక్స్‌లో టిక్‌మార్క్‌ పెట్టి రిజిస్టర్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి. 

మీ మెయిల్‌/మొబైల్‌కు వెరిఫికేషన్‌ను కోడ్‌ వస్తుంది. దాన్ని వెబ్‌సైట్‌లో నమోదు చేయడంతో రిజిస్ట్రేషన్‌ పూర్తయి.. మీ ఖాతా ప్రారంభవుతుంది. ఆ ఖాతా ద్వారా మీరు రైలు టికెట్లను సలువుగా.. బుక్‌ చేసుకోవచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని