Ayyanna Patrudu: అయ్యన్న ఇంటి గోడ కూల్చివేత.. నర్సీపట్నంలో భారీగా పోలీసుల మోహరింపు

తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. నర్సీపట్నంలోని ఆయన ఇంటి వద్ద 100 మందికి పైగా పోలీసులు మోహరించారు.

Updated : 19 Jun 2022 10:46 IST

నర్సీపట్నం: తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. నర్సీపట్నంలోని ఆయన ఇంటి వద్ద 100 మందికి పైగా పోలీసులు మోహరించారు. ఈ వ్యవహారంలో ఎవరినీ అరెస్ట్ చేయడం లేదని అనకాపల్లి డీఎస్పీ విజయ్‌భాస్కర్‌ స్పష్టం చేశారు. ఆక్రమణల తొలగింపునకు అధికారులు ముందస్తుగా కోరిన మేరకు అయ్యన్న ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. 

మరోవైపు నర్సీపట్నంలో పట్టణంలో పలుచోట్ల పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కేడీ పేట మార్గం, ఐదురోడ్ల జంక్షన్‌ పాటు మరికొన్ని ప్రాంతాల్లో బారికేడ్లను పెట్టి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అయ్యన్నపాత్రుడు అనుచరులు, తెదేపా కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. శనివారం అర్ధరాత్రి నుంచి అయ్యన్న ఇంటి పరిసర ప్రాంతంలో విద్యుత్‌ను అధికారులు నిలిపేశారు. ఇంటి గోడ కూల్చివేత నేపథ్యంలో అయ్యన్న ఇంటి వద్దే ఆర్డీవో గోవిందరావు, మున్సిపల్‌ కమిషనర్‌ ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని