Hyderabad: జలమండలి మరో ఘనత.. మూడోసారి ఐఎస్‌ఓ గుర్తింపు

భాగ్యనగర వాసులకు తాగునీరు సరఫరా చేస్తూ సేవలందిస్తున్న జలమండలి మరో ఘనతను సొంతం చేసుకుంది. తాగునీటి సరఫరాలో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలకుగాను మూడోసారి ధ్రువపత్రం లభించింది. 

Updated : 25 Jul 2023 20:24 IST

హైదరాబాద్‌: భాగ్యనగర వాసులకు తాగునీరు సరఫరా చేస్తూ సేవలందిస్తున్న జలమండలి మరో ఘనతను సొంతం చేసుకుంది. తాగునీటి సరఫరాలో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలకు ఐఎస్‌ఓ-9001:2015 ధ్రువపత్రం మరోసారి  లభించింది. ఈ ధ్రువీకరణను మరో 3 ఏళ్లు పొడిగిస్తున్నట్లు జియోటెక్ గ్లోబల్ సర్టిఫికెట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు తెలిపారు. దీనికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని జలమండలి అధికారులకు పంపించారు. ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఈ ధ్రువీకరణ పత్రాన్ని టెక్నికల్ డైరెక్టర్ పి.రవికుమార్, ట్రాన్స్‌మిషన్‌ సీజీఎం దశరథ్ రెడ్డి.. జలమండలి ఎండీ దానకిశోర్‌కు అందించారు.

ఐఎస్‌ఓ ధ్రువీకరణ పొడిగింపు పట్ల ఎండీ దానకిశోర్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నందుకు జలమండలి ఉద్యోగులు, సిబ్బందిని ఆయన అభినందించారు. జలమండలికి ఐఎస్‌ఓ ధ్రువపత్రం 2017 జులైలో మొదటిసారి వచ్చింది. అనంతరం రెండో సారి 2023 జులై వరకు మరోసారి పొడిగించారు. తాజాగా దాన్ని మూడోసారి మరో మూడేళ్ల పాటు పునరుద్ధరించారు. 2026 జులై వరకు ఇది వర్తించనుంది. నదుల నుంచి నీటిని సేకరించింది మొదలు వినియోగదారులకు సరఫరా చేసే వరకు.. నిల్వ చేయడం, శుద్ధి ప్రక్రియ, క్లోరినేషన్, పంపింగ్, ట్రాన్స్ మిషన్, డిస్ట్రిబ్యూషన్ మొదలైన పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నందుకు ఈ ధ్రువపత్రాన్ని అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని