Health: తరచుగా గర్భం ఎందుకు పోతుందో తెలుసుకోండి..!

:గర్భం దాల్చడం ఆ కుటుంబానికి ఎంతో సంతోషం కలిగిస్తుంది. అయితే ఉన్నట్టుండి గర్భస్రావం జరిగితే కలిగే మనోవేదన అంతా ఇంతా కాదు. 

Published : 28 Jun 2022 18:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గర్భం దాల్చడం ఆ కుటుంబానికి ఎంతో సంతోషం కలిగిస్తుంది. అయితే ఉన్నట్టుండి గర్భస్రావం జరిగితే కలిగే మనోవేదన అంతా ఇంతా కాదు. గర్భస్రావం ఎందుకు జరిగిందని ఆందోళనకు గురవుతాం. కాఫీ, టీ ఎక్కువగా తాగడంతో జరిగిందా..? తెలియకుండా బొప్పాయి తిన్నా..దానితో అయ్యిందా..? అని మదన పడుతుంటారు. గర్భిణి అలవాట్లకు గర్భస్రావం జరగడానికి సంబంధం ఉందా..? ఈ విషయంపై సీనియర్‌ గైనకాలజిస్టు చందు శైలజ పలు ఆసక్తికర అంశాలను తెలిపారు.

కారణాలు అనేకం

గర్భస్రావం కావడానికి చాలా కారణాలున్నాయి. తల్లిదండ్రుల వయస్సు, జన్యుపరమైన కారణాలు, యాంటీబయోటిక్స్‌ వినియోగించడం,హార్మోన్ల హెచ్చుతగ్గులు, గర్భాశయ ఆకృతిలో లోపాలున్నా గర్భస్రావం అవుతుంది. తల్లి వయస్సు 35 ఏళ్లు, తండ్రి వయస్సు 40 దాటిన తర్వాత కణాల్లో కూడా వయస్సు మీరిన ప్రభావం ఉంటుంది.

ఈ అలవాట్లు సరికాదు

కాఫీ ఎక్కువగా తాగడం, సిగరెట్లు ఎక్కువగా తాగడం కూడా కారణమని పరిశోధనలు తేల్చాయి. ఆల్కహాల్‌ తీసుకోవడం ఎదిగే పిండానికి హానికరమని తెలుస్తోంది. వారానికి నాలుగైదుసార్లు మద్యం తాగినా లోపల పెరిగే ఎంబ్రియోకి హానికరంగా మారుతుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని