Telangana News: వాసవి గ్రూప్‌ స్థిరాస్తి సంస్థపై ఐటీ దాడులు.. 40 బృందాలతో సోదాలు

వాసవి గ్రూప్‌ స్థిరాస్తి సంస్థపై ఆదాయ పన్నుశాఖ దాడులు నిర్వహించింది. బంజారాహిల్స్‌లోని

Published : 17 Aug 2022 17:32 IST

హైదరాబాద్‌: వాసవి గ్రూప్‌ స్థిరాస్తి సంస్థపై ఆదాయ పన్నుశాఖ దాడులు నిర్వహించింది. బంజారాహిల్స్‌లోని వాసవి గ్రూప్‌ ప్రధాన కార్యాలయంతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ నగరంలో 40కి పైగా ఐటీ బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నట్టు అధికారులు తెలిపారు. వాసవి గ్రూపు ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌, డైరెక్టర్ల ఇళ్లలో, సంస్థ ప్రధాన కార్యాలయం, అనుబంధ కార్యాలయాల్లోనూ ఆదాయపన్ను శాఖ సోదాలు చేస్తోంది. ఈ సంస్థ తమకు వస్తున్న ఆదాయానికి, ప్రభుత్వానికి చెల్లిస్తున్న ఆదాయపు పన్నుకు వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేసినట్లు ఐటీ అధికారులు తెలిపారు. వాస్తవ ఆదాయం చూపడం లేదన్న ఆరోపణలపై ఐటీ సోదాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆ సంస్థకు చెందిన విలువైన పత్రాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని