9న అమ్మఒడి రెండో విడత

ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 9న జగనన్న అమ్మఒడి రెండో విడత సొమ్ములు ఖాతాల్లో జమ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించారు. అమ్మఒడి...

Published : 15 Dec 2020 02:06 IST

అమరావతి: ఏపీలో జనవరి 9న ‘జగనన్న అమ్మఒడి’ రెండో విడత నగదు ఖాతాల్లో జమ చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించారు. అమ్మఒడి పొందేందుకు ఈనెల 20 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 16-19 తేదీల వరకు లబ్ధిదారుల ప్రాథమిక జాబితా విడుదల చేస్తామని, 20-24  మధ్య జాబితాలో తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. అనంతరం ఈనెల 26న అమ్మఒడి లబ్ధిదారుల తుది జాబితాను వెలువరిస్తామన్నారు.

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అమ్మఒడి పథకం అందజేస్తామని మంత్రి సురేశ్‌ వెల్లడించారు. గతేడాది 43.54 లక్షల మంది లబ్ధిదారులకు ఈ పథకం కింద రూ.6,336 కోట్లు పంపిణీ చేశామని వివరించారు. రాష్ట్రంలో టీచర్ల బదిలీ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని మంత్రి చెప్పారు. నాలుగు కేటగిరీలుగా విభజించి బదిలీలు చేపడుతున్నామన్నారు. కొన్ని పాఠశాలల్లోని ఖాళీలు భర్తీ చేసేందుకే బదిలీ ప్రక్రియ చేపట్టినట్లు మంత్రి సురేశ్ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని