Health: మోకీలు మార్పిడి ఎప్పుడు అవసరమో తెలుసా?

వయసు పెరుగుతున్న కొద్దీ జవసత్వాలు ఉడిగిపోతాయి. ఎముకలే కాదు..ఏ పని చేయాలన్నా ఇబ్బందులు తలెత్తుతాయి. పని చేయాలనే తపన ఉన్నా చేసే సత్తువ ఒంట్లో ఉండదు.

Updated : 10 Aug 2022 10:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వయసు పెరుగుతున్న కొద్దీ జవసత్వాలు ఉడిగిపోతాయి. ఎముకలే కాదు..ఏ పని చేయాలన్నా ఇబ్బందులు తలెత్తుతాయి. పని చేయాలనే తపన ఉన్నా చేసే సత్తువ ఒంట్లో ఉండదు. లేచి నాలుగు అడుగులు వేయడం కష్టంగా ఉంటుంది. 50 ఏళ్లు దాటిన తర్వాత ఎముకలు, కీళ్లలో అరుగుదల మొదలవుతుంది. దాంతో పాటే గుజ్జు కూడా అరిగిపోతుంది. చాలా మంది కూర్చొవడం, నిలబడటం, కొద్ది దూరం వెళ్లడానికే ఆపసోపాలు పడుతారు. పోటెత్తె నొప్పులకు మందులు, వ్యాయామం చేస్తుంటాం. నొప్పి నివారణకు మోకీళ్లలో ఇంజిక్షన్లు, మోకీలు మార్పిడి దాకా వెళ్లాల్సి వస్తుందని జాయింట్‌ నీ రిప్లేస్‌మెంట్‌ సర్జన్‌ నీలం వెంకటరమణారెడ్డి చెబుతున్నారు.

మోకాలు నొప్పులు: మోకాలు నొప్పులు ఆర్థరైటిస్‌లో ఉంటుంది. ఇది ఒక చిన్న పరిణామం మాత్రమే. నాలుగు స్టేజీల్లో మోకీలు నొప్పులు వస్తుంటాయి. మొదటి రెండు దశల్లో కూడా మందులతో నయం అవుతుంది. మూడోదశలో నొప్పుల నివారణకు ఇంజిక్షన్లు వేయాల్సి రావొచ్చు. దీంతో పాటు జీవన శైలిలో మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. నాలుగో దశ ఆర్థరైటిస్‌లో రెండు ఎముకల మధ్య రాసుకున్నపుడు మోకీలు మార్పిడి గురించి ఆలోచించాల్సి ఉంటుంది.

అన్నీ ఒకే రకం కాదు: అన్ని నొప్పులు ఆర్థరైటిస్‌ కాదు.. వేరే కారణాలు కూడా ఉండొచ్చు. కార్టిలేజ్‌,  లిగ్‌మెంట్‌, మెనిస్కస్ దెబ్బతినడంతో కూడా నొప్పి వస్తుంటుంది. ఇలాంటి నొప్పులను గుర్తించిన తర్వాత చికిత్సపై దృష్టి సారించాలి. ఇలాంటి నొప్పి గుర్తిస్తే మందులతోనే సరి చేయవచ్చు. వాళ్లకు మోకీలు మార్పిడి అవసరం లేదు. 

ఎవరికి అవసరం: మోకీలు మార్పిడి రుమటైడ్‌ ఆర్థరైటిస్‌, సిరోనెగెటీవ్‌ ఆర్థరైటిస్‌ ఉన్నవారికి ఆలోచించాలి. మోకీలు మార్పిడికి కూడా గరిష్ఠ కాల వ్యవధి ఉంటుంది. 50 ఏళ్ల వారికి మార్పిడి చేస్తే 75 ఏళ్లకు మళ్లీ మోకీలు మార్పిడి చేయాల్సి వస్తుంది. ఇది కూడా సాధారణ దినచర్యలను కూడా చేసుకోలేని వారికి మాత్రమే శస్త్రచికిత్సకు వెళ్తాం. మోకాలు నొప్పి ఉండి సాధారణ పనులు చేసుకునే వారికి శస్త్రచికిత్స వాయిదా వేస్తాం. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని