Hyderabad: కార్‌ పార్కింగ్‌కు రూ.500 వసూలు.. కేటీఆర్‌కు ట్వీట్‌ చేసిన బాధితుడు

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో కారు పార్కింగ్ చేసిన ఓ వ్యక్తి నుంచి భారీగా ఛార్జీ వసూలు చేశారు.  బ్రిగేడియర్ జైరత్ అనే ప్రయాణికుడు తన వాహనాన్ని 31 నిమిషాలపాటు

Published : 11 Nov 2021 01:30 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో కారు పార్కింగ్ చేసిన ఓ వ్యక్తి నుంచి భారీగా ఛార్జీ వసూలు చేశారు.  బ్రిగేడియర్ జైరత్ అనే ప్రయాణికుడు తన వాహనాన్ని 31 నిమిషాలపాటు పార్కింగ్ చేసినందుకుగాను అతడి నుంచి రూ.500 వసూలు చేశారు. అంత భారీగా పార్కింగ్‌ ఛార్జీ వసూలు చేయడంపై ఆయన పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. రైల్వేశాఖ చెబుతున్న ‘వికాస్’ ఎవరిదని ఆ ప్రయాణికుడు ప్రశ్నించాడు. అతడి ట్వీట్‌కు కేటీఆర్‌ స్పందించారు. అది నిజంగా దారుణమన్నారు. ఈ అంశంపై స్పందించాలంటూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు రీట్వీట్ చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని