సాయం కోసం బారులు తీరిన వరద బాధితులు

నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన బాధితులు వరద ఆర్థిక సాయం కోసం మీ సేవ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ముంపునకు గురైన బాధితులకు ..

Updated : 13 Sep 2023 16:03 IST

మీ సేవ కేంద్రాలకు పోటెత్తిన నగరవాసులు

హైదరాబాద్‌: నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన బాధితులు వరద ఆర్థిక సాయం కోసం మీ సేవ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ముంపునకు గురైన బాధితులకు తెలంగాణ ప్రభుత్వం రూ.10వేల ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురికి సాయం అందించినప్పటికీ కొందరికి అందలేదు. దీంతో నగదు అందనివారు మీ సేవ కేంద్రాల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్న సర్కారు సూచనల మేరకు బాధితులు మీ సేవ కేంద్రాల వద్దకు భారీగా తరలివస్తున్నారు. 

మీ సేవ కేంద్రాల్లో తమ పేర్లు నమోదు చేసుకున్న మరుసటి రోజునే నగదు వారి ఖాతాల్లో బదిలీ అవుతుండటంతో ఇవాళ చందానగర్‌లోని మీ సేవ కేంద్రం వద్దకు మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అదేవిధంగా శేరిలింగంపల్లి పరిధిలో, అంబర్‌పేట గోల్నాకా, సీతాఫల్‌మండి, సనత్‌నగర్‌, మారేడ్‌పల్లి, అడ్డగుట్ట, ఎల్బీనగర్‌, వనస్థలిపురం పరిధిలోని మీ సేవ కేంద్రాలకు వరద బాధితులు క్యూ కట్టారు. అయితే, జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో తమకు నగదు బదిలీ అవుతుందో కాదోనన్న ఆందోళన బాధితులు వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని