MLC Kavitha: ఈ నెల 9న నిజామాబాద్‌ ఐటీ హబ్‌ ప్రారంభం

Published : 07 Aug 2023 21:15 IST

నిజామాబాద్‌: నిజామాబాద్‌ ఐటీ హబ్‌ను ఈ నెల 9న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న నిజామాబాద్ ఐటీ హబ్‌ను ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా, ఆర్టీసీ ఛైర‌్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌లతో కలిసి కవిత సందర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 

‘‘750 మంది పని చేసే సామర్థ్యంతో ఐటీ టవర్‌ను నిర్మించాం. ఇప్పటికే 15 కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. ఇటీవల ఉద్యోగ మేళాలో 280 మందికి ఆయా కంపెనీలు నియామక ఉత్తర్వులు ఇచ్చాయి. ఇప్పటికే 200 మంది ఉద్యోగాలలో చేరేందుకు సంసిద్ధత తెలిపారు. దివ్యాంగ అభ్యర్థులకు ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వ్ చేశాం. టాస్క్‌ ఆధ్వర్యంలో శిక్షణనిచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా నిజామాబాద్‌లో ప్రతి నెలా ఒక జాబ్ మేళా ఉండేలా చర్యలు తీసుకున్నాం. ఈ నెల 29న మరో జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. అమెజాన్, హెచ్‌డీఎఫ్‌సీ, గూగుల్, టెక్ మహీంద్రా, ఐబీఎం వంటి 52 అంతర్జాతీయ కంపెనీలు మేళాకు వస్తున్నాయి. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని’’ అని ఎమ్మెల్సీ కవిత సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు