Hyderabad: జీహెచ్‌ఎంసీకి కొత్త కమిషనర్‌ నియామకం.. ప్రభుత్వం ఉత్వర్వులు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)కు నూతన కమిషనర్‌ను ప్రభుత్వం నియమించింది. లోకేష్ కుమార్‌ను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆయన స్థానంలో బల్దియా బాధ్యతలను రొనాల్డ్ రోస్‌కు అప్పగించింది.

Published : 04 Jul 2023 15:08 IST

హైదరాబాద్‌: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)కు నూతన కమిషనర్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆర్థికశాఖ కార్యదర్శిగా ఉన్న రొనాల్డ్ రోస్ ను జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా కొనసాగుతోన్న లోకేష్ కుమార్‌కు రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా ఈసీ నియమించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగణంగా లోకేష్ కుమార్‌ను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆయన స్థానంలో బల్దియా బాధ్యతలను రొనాల్డ్ రోస్‌కు అప్పగించింది.

ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌ను రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారిగా ఈసీ నియమించింది. సర్ఫరాజ్‌ను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. వెయిటింగ్ లో ఉన్న ముషారఫ్ అలీ ఫారుఖీని ఎక్సైజ్ శాఖ సంచాలకులుగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలకు కొనసాగింపుగా మరికొన్ని బదిలీలు కూడా జరగనున్నాయి. ఆర్థికశాఖ కార్యదర్శి, గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి, పురపాలక శాఖ సంచాలకుల పోస్టులకు అధికారులను నియమించాల్సి ఉంది. ఈసీ నిబంధనలకు లోబడి కొన్ని జిల్లాల కలెక్టర్లను బదిలీ చేయాల్సి ఉంది. కొందరు అధికారులు వెయిటింగ్‌లో ఉన్నారు. వారికి కూడా పోస్టింగులు ఇవ్వాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని