Pawan Kalyan: అభిమాని అత్యుత్సాహం.. కారుపై పడిపోయిన పవన్‌ కల్యాణ్‌

జనసేన అధినేత, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది...

Updated : 20 Feb 2022 19:26 IST

నరసాపురం: జనసేన అధినేత, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం నుంచి నరసాపురం ర్యాలీగా వస్తున్న పవన్‌ కల్యాణ్‌ కు తృటిలో ప్రమాదం తప్పింది. కారుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో వెనుక నుంచి ఓ అభిమాని దూసుకొచ్చాడు. అభిమాని లాగడంతో నిల్చుని అభివాదం చేస్తున్న  పవన్‌ కల్యాణ్‌ కారుపైనే పడిపోయారు. వెంటనే తేరుకుని పైకిలేచారు. ఈఘటనతో పవన్‌తో పాటు అభిమానులు కంగుతిన్నారు. అనంతరం ర్యాలీ యథావిధిగా కొనసాగింది.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని