Phone tapping case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. రాధాకిషన్‌రావు రిమాండ్‌ పొడిగింపు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు(Phone tapping case)లో టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు రిమాండ్‌ను కోర్టు పొడిగించింది.

Updated : 10 Apr 2024 11:52 IST

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు(Phone tapping case)లో టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. వారం రోజుల కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 12 వరకు రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. 

జైలులో లైబ్రరీకి వెళ్లేందుకు అనుమతించడం లేదని రాధాకిషన్‌రావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జైలు సూపరింటెండెంట్‌ను సైతం కలవనీయడం లేదని తెలిపారు. దీంతో పోలీసులను న్యాయమూర్తి పిలిపించి ప్రశ్నించారు. లైబ్రరీలోకి అనుమతించడంతో పాటు సూపరింటెండెంట్‌ను కలిసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు గాంధీ ఆస్పత్రిలో రాధాకిషన్‌రావుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కోర్టు రిమాండ్‌ విధించిన అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ప్రత్యేక పీపీని నియమించనున్న ప్రభుత్వం!

మరోవైపు ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ కోసం ప్రత్యేక పీపీని నియమించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. నెలరోజులుగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. రాధాకిషన్‌రావుతో పాటు మాజీ అడిషనల్‌ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావులను అరెస్ట్‌ చేశారు. హై ప్రొఫైల్‌ కేసు కావడంతో ప్రత్యేక పీపీని నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని