AP: స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కోసం కమిటీ ఏర్పాటు

స్థానికత అంశంపై రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కోసం ఏపీ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

Published : 19 Feb 2024 20:22 IST

అమరావతి: స్థానికత అంశంపై రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కోసం ఏపీ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. స్థానికత ఆధారంగా విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల కోటా కోసం సవరణ లేదా కొత్తగా ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన పూర్తయి పదేళ్లు పూర్తికానుండటంతో రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. 

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పదేళ్లపాటు స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు కావాలని కేంద్రం విభజన చట్టంలో పేర్కొన్నారు. అయితే, ఈ గడువు 2024 జూన్ 2 తేదీతో ముగియనుండటంతో ప్రస్తుతం సవరణ లేదా కొత్త ఉత్తర్వుల ప్రతిపాదనల కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. ఛైర్మన్‌గా, 8 మంది ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. స్థానికత కోటా అంశంపై విద్యార్థులు, అసోసియేషన్లు, యూనియన్లు, నిపుణులు, ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని