Antibiotics: యాంటీ బయోటిక్స్‌ ఇష్టం వచ్చినట్టు వాడొద్దు..!

ప్రతి చిన్న జబ్బుకు యాంటీ బయోటిక్స్‌ వాడకం ఎక్కువయ్యింది. దీంతో ఉన్న కొద్దిపాటి మందులకు వ్యాధి నిరోధకత వచ్చేస్తుంది. చివరకు అవి ఎందుకు కొరకాకుండా పోతున్నాయి. కొంత అవగాహన లేకపోవడం, మరికొంత మందుల దుకాణాలతో జరుగుతోంది.

Published : 07 Aug 2022 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతి చిన్న జబ్బుకు యాంటీ బయోటిక్స్‌ వాడకం ఎక్కువైంది. దీంతో ఉన్న కొద్దిపాటి మందులకు వ్యాధి నిరోధకత వచ్చేస్తుంది. చివరకు అవి ఎందుకూ కొరకాకుండా పోతున్నాయి. కొంత అవగాహన లేకపోవడం, మరికొంత మందుల దుకాణాలతో జరుగుతోంది. ఈ నేపథ్యంలో యాంటీ బయోటిక్స్‌ ఎలా వాడాలి..? వాటి పర్యవసానం ఎలా ఉంటుందో సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్‌ ఎంబీవీ ప్రసాద్‌ వివరించారు.

ఇది మంచిది కాదండోయ్‌

చాలా మంది సొంత వైద్యం చేసుకుంటారు. తలనొప్పిలాంటి మందులైతే పరవాలేదు.. కానీ అన్నింటికీ యాంటీబయోటిక్స్‌ విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. జలుబు, దగ్గు వచ్చినప్పుడు ఒక రోజు చూసి తగ్గకపోతే వాడేస్తున్నారు. వ్యాధి నిరోధకత శరీరం పెంచుకోకుండా మందుల వైపు వెళ్తున్నారు. తర్వాత ఇతర జబ్బులకు ఈ మందులు పని చేయడం లేదు. మళ్లీ మోతాదు పెంచి రెండు, మూడు రకాల యాంటీబయోటిక్స్‌ మందులు ఇవ్వాల్సి వస్తుంది. సాధ్యమైనంత వరకు వైద్యుల సూచన లేకుండా మందులను వాడొద్దు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని