Kerala: ఎరక్కపోయి వచ్చి.. ఇరుక్కున్న కొండచిలువ!

ఆహారం కోసం జనావాసంలోకి వచ్చిన ఓ కొండ చిలువ ఊహించని ఆపదలో చిక్కుకుంది.

Published : 29 Sep 2021 02:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆహారం కోసం జనావాసాల్లోకి వచ్చిన ఓ కొండ చిలువ ఊహించని ఆపదలో చిక్కుకుంది. కేరళలోని త్రిస్సూర్ జిల్లా తలికుళంలో  జనావాసాల్లోకి వచ్చిన కొండ చిలువ వీధి కుక్క మింగేసింది. ఆ తర్వాత అక్కడ నుంచి కదల్లేక తీవ్ర ఇబ్బందులు పడింది. జనావాసంలో నుంచి అడవిలోకి వెళ్లలేక అవస్థలు పడుతున్న కొండచిలువను స్థానికులు గమనించారు. అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అటవీ సిబ్బంది అతికష్టం మీద కొండ చిలువను కాపాడి సమీపంలోని అడవిలో వదిలిపెట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని