Ram Charan: మనం నడిచే నేల, పీల్చే గాలిపై వారి సంతకం ఉంటుంది: రామ్‌ చరణ్‌

దేశభద్రతను కాపాడుతున్న జవాన్ల త్యాగాన్ని గౌరవించుకోవడం తన అదృష్టమన్నారు మెగా హీరో రామ్‌చరణ్‌.

Updated : 23 Apr 2022 13:51 IST

హైదరాబాద్‌: దేశభద్రతను కాపాడుతోన్న జవాన్ల త్యాగాన్ని గౌరవించుకోవడం మన అందరి బాధ్యత అని మెగా హీరో రామ్‌చరణ్‌ అన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లోని యుద్ధవీరుల స్మారక స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ  కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టమని పేర్కొన్నారు. ‘దేశం ప్రశాంతంగా ఉందంటే అది సైనికుల వల్ల మాత్రమే. దేశవీరుల ధైర్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వారి త్యాగాలను ఎవ్వరూ మర్చిపోకూడదు. మనం నడిచే నేల, పీల్చే గాలి, బతికే దేశం.. వీటన్నింటిపై  సైనికుల సంతకం ఉంటుందన్న విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి’ అని రామ్‌చరణ్‌ అన్నారు. ఈ సందర్భంగా తాను నటించిన ధ్రువ సినిమాను గుర్తుచేసుకుంటూ ఆ సినిమాలో ఆర్మీ జవాన్‌ పాత్ర పోషించడం ఎంతో గర్వంగా ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని