Amaravati: సమగ్ర శిక్షా అభియాన్‌ జేఏసీతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు విఫలం

సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల జేఏసీతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చలు విఫలమయ్యాయి.

Published : 30 Dec 2023 22:02 IST

అమరావతి: సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల జేఏసీతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ‘‘ఉద్యోగులు కోరుతున్న రీతిలో సానుకూలంగా చర్చలు జరగలేదు. సమగ్ర శిక్షా అభియాన్‌ సిబ్బందిని రెగ్యులర్‌ చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు వేతనాలు పెరగని వారికి మాత్రమే పెంచుతామన్నారు. దానిపై కూడా నిర్దిష్టమైన హామీ రాలేదు. ఆదివారం నిరసన శిబిరం వద్ద చర్చల సారాంశాన్ని తెలియజేస్తాం. తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం’’ అని జేఏసీ ప్రతినిధులు తెలిపారు.

చర్చల అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. జేఏసీ ప్రతినిధులతో చర్చించాం.. సమ్మెలో కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఎన్నికల ముందు అడిగితే అన్నీ అయిపోతాయనే ఆలోచనలో ఉన్నారు. సమ్మె చేసే వారి వెనుక కమ్యూనిస్టు పార్టీ నేతలు ఉంటున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి సీఎం జగన్ (CM Jagan) మోసం చేశారంటూ సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత, గ్రాట్యుటీ తదితర డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సమ్మె కొనసాగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని