Andhra News: అల్లూరి జిల్లాలో ఆంత్రాక్స్‌ కలకలం.. ఏడుగురి నుంచి నమూనాల సేకరణ

అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపట్టులో ఆంత్రాక్స్‌ కలకలం రేగింది. ఆంత్రాక్స్ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఏడుగురి నుంచి నమూనాలు

Published : 01 Sep 2022 02:49 IST

ముంచంగిపట్టు: అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపట్టులో ఆంత్రాక్స్‌ కలకలం రేగింది. ఆంత్రాక్స్ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఏడుగురి నుంచి నమూనాలు సేకరించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జె.నివాస్ తెలిపారు. ప్రాథమిక పరీక్షల ఫలితాల్లో నెగటివ్ అని రిపోర్టు వచ్చినట్లు ఆయన తెలిపారు. టిష్యూ కల్చర్ పరీక్షల పూర్తి ఫలితాలు వచ్చేందుకు 48 గంటల సమయం పడుతుందన్నారు. వచ్చిన రిపోర్టుల ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు. ముంచంగిపట్టు గ్రామంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని.. ఆ ప్రాంతంలో జంతువులన్నింటికీ వ్యాక్సినేషన్ చేసినట్లు నివాస్‌ తెలిపారు. స్థానికులకు వైద్య పరీక్షలు, స్ర్కీనింగ్ నిర్వహించినట్లు కమిషనర్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని