Published : 09 Apr 2021 16:40 IST

రైళ్లలో రద్దీ పెరగడం అవాస్తవం: ద.మ.రైల్వే

హైదరాబాద్‌: రైళ్లలో రద్దీ పెరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న దృశ్యాలు వాస్తవం కాదని.. ప్రయాణికుల రద్దీ సాధారణంగానే ఉందని దక్షిణ మధ్య రైల్యే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన వర్చువల్‌గా మీడియాతో మాట్లాడారు. ద.మ.రైల్వే పరిధిలో 300 కి.మీ. మేర కొత్త రైల్వే లైన్‌ పూర్తయిందని.. 750 కి.మీ. మేర విద్యుదీకరణ పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రమాదాల నివారణకు 321 కి.మీ. పరిధిలోని 34 స్టేషన్లల్లో ట్రైన్‌ కొలిజన్‌ అవైడింగ్‌ సిస్టమ్‌ (టీసీఏఎస్‌) వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. చెన్నై-దిల్లీ మార్గంలో 2,828 కి.మీ. మేర రైళ్ల వేగాన్ని గంటకు 130 కిలోమీటర్లకు పెంచామన్నారు.

ద.మ.రైల్వే పరిధిలో పార్శిల్స్‌ ద్వారా అత్యధికంగా రూ.108 కోట్ల ఆదాయం సమకూరినట్లు గజానన్‌ తెలిపారు. దేశ రాజధాని దిల్లీకి 2020-21 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 7.3 కోట్ల లీటర్ల పాలు, 120 కిసాన్‌ రైళ్ల ద్వారా 50 శాతం రాయితీతో 40వేల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసినట్లు చెప్పారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 183 రైళ్లు నడవగా.. కొవిడ్‌ నేపథ్యంలో 2020-21లో కొంతకాలం పూర్తిగా స్తంభించిపోయాయని.. అనంతరం కరోనా ప్రభావం తగ్గిన వెంటనే దశల వారీగా 180 రైళ్లను పునరుద్ధరించినట్లు వెల్లడించారు. 2.40 కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేశామన్నారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని