Hyderabad: డిమాండ్‌ తగ్గే వరకు.. పాస్‌పోర్టుల జారీకి స్పెషల్‌ డ్రైవ్‌: బాలయ్య

తెలంగాణలో శనివారం 682 పాస్‌పోర్టు దరఖాస్తులు పరిశీలించినట్టు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు. 

Published : 27 May 2023 21:13 IST

హైదరాబాద్‌: తెలంగాణలో శనివారం 682 పాస్‌పోర్టు దరఖాస్తులు పరిశీలించినట్టు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు. అపాయింట్‌మెంట్ల కోసం రోజుల తరబడి వేచి చూడకుండా ఉండేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. విదేశాంగ మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు అన్ని శనివారాలు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు పనిచేస్తాయని వెల్లడించారు. హైదరాబాద్‌లో మూడింటితో పాటు ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లోని పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, రాష్ట్రంలోని 14 తపాలా కార్యాలయాలు శనివారం కూడా పనిచేస్తాయని పేర్కొన్నారు. ఇవాళ్టికి గత బుధవారం 700 అపాయింట్‌మెంట్లు ఇవ్వగా.. 682 దరఖాస్తులు ప్రాసెస్‌ అయ్యాయన్నారు. అపాయింట్‌మెంట్ల డిమాండ్‌ తగ్గే వరకు ప్రతి శనివారం పాస్‌పోర్టు సేవలు ఉంటాయని తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని