TSPSC: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ను తొలగించాలి.. ఓయూలో విద్యార్థుల ఆందోళన
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) బోర్డును రద్దు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన రహదారిపై విద్యార్థులు ఆందోళనకు దిగారు.
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) బోర్డును రద్దు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన రహదారిపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. గ్రూప్ - 1 పరీక్ష నిర్వహణలో పారదర్శకత లేదని హైకోర్టు ఇప్పటికే ప్రిలిమ్స్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ను తొలగించి కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షను పారదర్శకంగా నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో దీనికి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి ఓయూ ఠాణాకు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
టీచర్ అవుదామనుకొని..
-
రెండిళ్ల గొడవ.. రోడ్డెక్కింది గోడై!
-
IPL: ఐపీఎల్ వేలం.. 1166 మంది క్రికెటర్ల ఆసక్తి
-
Israel-Hamas Conflict: ఆగిన కాల్పులు విరమణ.. ఇజ్రాయెల్ దాడిలో 178 మంది మృతి
-
తుపాకులతో చొరబడి బ్యాంకులో రూ.18 కోట్ల దోపిడీ
-
Gujarat: గుండెపోటుతో 6 నెలల్లో 1052 మంది మృతి.. 80శాతం 25ఏళ్ల లోపువారే!