TS Inter: తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు రేపు విడుదల

తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు రేపు(శుక్రవారం) విడుదల కానున్నాయి. 

Updated : 06 Jul 2023 23:23 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 12 నుంచి 20 వరకు జరిగాయి. ప్రాక్టికల్‌ పరీక్షలు జూన్‌ 5 నుంచి 9 వరకు నిర్వహించారు. గత మేలో విడుదలైన ఫలితాల్లో మొదటి సంవత్సరం 63.85 శాతం, ద్వితీయ ఏడాదిలో 67.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన విషయం తెలిసిందే. ఫలితాలను www.eenadu.netలో చెక్‌ చేసుకోవచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని