Ap News: నెల్లూరులో స్టీల్‌ప్లాంట్‌

నెల్లూరు జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తమ్మినపట్నం-మోమిడి పరిధిలో రూ.7,500 కోట్లతో 11.6 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో దీన్ని

Published : 15 Jul 2021 14:46 IST

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

అమరావతి: నెల్లూరు జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తమ్మినపట్నం-మోమిడి పరిధిలో రూ.7,500 కోట్లతో 11.6 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేయనుంది. గతంలో కిన్నెటా పవర్‌కు ఇచ్చిన భూములను ప్రభుత్వం రద్దు చేసి వాటిని జిందాల్‌ సంస్థకు కేటాయించింది. ఈ మేరకు జిందాల్‌కు 860 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్టీల్‌ప్లాంట్‌తో 2,500 మందికి ప్రత్యక్షంగా.. 15వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్లాంట్‌ విస్తరణకు వచ్చే నాలుగేళ్లలో 3వేల ఎకరాలు అవసరమని అంచనా వేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు