Ap News: రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ పరిస్థితులు, తీసుకోవాల్సిన కట్టడి చర్యలపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో.. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్న

Updated : 21 Jul 2021 15:44 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ పరిస్థితులు, తీసుకోవాల్సిన కట్టడి చర్యలపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో.. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి కర్ఫ్యూని ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. జనసమూహాలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని