
Ap News: క్రిస్మస్, సంక్రాంతి స్పెషల్.. ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం
అమరావతి: క్రిస్మస్, సంక్రాంతి పండగల దృష్ట్యా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌కు గడువును పొడిగించింది. దూర ప్రాంతాలకు వెళ్లే అన్ని బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ గడువును పొడిగించింది. ప్రస్తుతం 30 రోజుల ముందు మాత్రమే ముందస్తు రిజర్వేషన్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. రేపటి నుంచి ఈ గడువును 60 రోజులకు పొడిగిస్తూ ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్లే బస్సుల్లో, రాష్ట్రంలోని పలు ప్రాంతాల మధ్య తిరిగే అన్ని దూరప్రాంత బస్సుల్లో ఈ విధానం అమల్లోకి వస్తుందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.