
TS News: ప్రతిభను గుర్తించి ఒలింపిక్స్‌కు పంపడమే లక్ష్యం: కిషన్‌రెడ్డి
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా క్రీడాకారుల్లోని ప్రతిభను గుర్తించి వారిని ఒలింపిక్స్‌కు పంపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉస్మానియా వర్సిటీలో స్పోర్ట్స్ క్లస్టర్‌కు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఖేలో ఇండియా పథకం కింద కేటాయించిన నిధులతో ఓయూలో మహిళా స్విమ్మింగ్‌పూల్, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, సింథటిక్ టెన్నిస్ కోర్టు ఏర్పాటు చేయనున్నారు.
క్రీడలపై పట్టు ఉంటే ఏ రంగంలోనైనా అవకాశం ఉంటుందని.. అందుకు ప్రతి విద్యార్థి ఏదో ఆటపై పట్టు పెంచుకోవాలని కిషన్‌రెడ్డి సూచించారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.