Ts News: పాలమూరు-రంగారెడ్డిపై ఎన్జీటీకి సంయుక్త కమిటీ మధ్యంతర నివేదిక

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)కి సంయుక్త కమిటీ నివేదిక సమర్పించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను అక్రమంగా నిర్మిస్తున్నారని ఏపీ రైతులు గతంలో ఎన్జీటీని ఆశ్రయించారు. నీటి కేటీయింపులు లేకుండానే ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు...

Updated : 24 Sep 2021 19:03 IST

హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)కి సంయుక్త కమిటీ నివేదిక సమర్పించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను అక్రమంగా నిర్మిస్తున్నారని ఏపీ రైతులు గతంలో ఎన్జీటీని ఆశ్రయించారు. నీటి కేటీయింపులు లేకుండానే ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. పాలమూరు-రంగారెడ్డి తాగునీటి కోసమే అని ఆ సమయంలో తెలంగాణ వాదనలు వినిపించింది. ఈ అంశంపై నిజనిర్ధారణ కోసం గతంలో ఎన్జీటీ సంయుక్త కమిటీని నియమించింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు ఇటీవలే సంయుక్త కమిటీ ప్రాజెక్టును సందర్శించింది. ఈ మేరకు ఎన్జీటీకి మధ్యంతర నివేదికను సమర్పించింది. ప్రాజెక్టులో సాగునీటి పనులూ జరుగుతున్నా్యని కమిటీ నివేదికలో పేర్కొంది. తుది నివేదిక ఇచ్చేందుకు 8 వారాలు గడువు కావాలని ఎన్జీటీని కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని