
Updated : 30 Nov 2021 12:37 IST
Hyderabad News: సికింద్రాబాద్ పరేడ్ మైదానం ప్లైఓవర్‌పై కారు దగ్ధం
హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ మైదానం ప్లైఓవర్‌పై కారు దగ్ధమైంది. అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగడంతో ఆ మార్గంలో వెళుతున్న వాహనదారులు భయాందోళన చెందారు. కారు దగ్ధం వల్ల ప్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉన్నట్టుండి వాహనంలో మంటలు రావడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వెంటనే స్పందించిన పోలీసులు ప్లైఓవర్‌పై ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. క్రేన్ సాయంతో కారును అక్కడి నుంచి తొలగించారు.
Tags :