AP News: రమ్య హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు: సుచరిత

గుంటూరులో ఇటీవల ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని హోంమంత్రి సుచరిత పరామర్శించారు.

Updated : 11 Sep 2021 14:52 IST

గుంటూరు: గుంటూరులో ఇటీవల ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని హోంమంత్రి సుచరిత పరామర్శించారు. రమ్య కుటుంబానికి ప్రభుత్వం తరఫున కేటాయించిన 5 సెంట్ల ఇంటి స్థలం పత్రాలను అందజేశారు. రమ్య సోదరికి త్వరలో ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని.. ఐదు ఎకరాల సాగు భూమిని కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. కేసు సత్వర న్యాయ విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వివరించారు.
మేడికొండూరు మండలం పాలడుగు వద్ద జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని.. విచారణ దశలో పూర్తి వివరాలను వెల్లడించలేమని హోం మంత్రి చెప్పారు. పోలీసులకు కొన్ని ఆధారాలు దొరికాయని.. నిందితులను పట్టుకొని మీడియా ముందు ప్రవేశ పెడతామని ఆమె స్పష్టం చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని