KRMB: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం వాయిదా పడింది. ఈ నెల 27న జరగాల్సిన బోర్డు సమావేశాన్ని సెప్టెంబర్ 1కి వాయిదా వేశారు. 27వ తేదీన జరగాల్సిన 14వ...

Updated : 24 Aug 2021 15:00 IST

దిల్లీ: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం వాయిదా పడింది. ఈ నెల 27న జరగాల్సిన బోర్డు సమావేశాన్ని సెప్టెంబర్ 1కి వాయిదా వేశారు. 27వ తేదీన జరగాల్సిన 14వ సమావేశం ఎజెండాను గతంలోనే ఖరారు చేసిన బోర్డు.. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు సమాచారం అందించారు. రెండు రాష్ట్రాలకు చెందిన పలు అంశాలు, గెజిట్ నోటిఫికేషన్ పరిధి సంబంధిత అంశాలను ఎజెండాలో చేర్చారు. మరికొన్ని అంశాలను చేర్చాలని కోరుతూ రెండు రాష్ట్రాలూ బోర్డుకు లేఖలు రాశాయి. అయితే బోర్డు 14వ సమావేశాన్ని వాయిదా వేసి సెప్టెంబర్ 1న నిర్వహించనున్నట్లు కేఆర్ఎంబీ తెలిపింది. ఈ మేరకు బోర్డు సభ్యకార్యదర్శి రాయిపురే రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు. ఒకటో తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ జలసౌధలో బోర్డు భేటీ జరగనుంది. కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎం.పి.సింగ్ సెలవులో ఉన్నందున భేటీ వాయిదా వేసినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని