Corona Vaccine: టీకా సమాచారమున్న ల్యాప్‌టాప్‌లు మాయం!

గ్రేటర్‌ వ్యాప్తంగా కొవిడ్‌ టీకా కేంద్రాలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ప్రత్యేక టీకా కార్యక్రమంలో భాగంగా అధికారులు నగరవ్యాప్తంగా వందకుపైగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ద్వారా సమకూర్చుకున్న కంప్యూటర్‌ ఆపరేటర్లు

Updated : 06 Oct 2021 10:31 IST

మూణ్నెళ్లుగా వేతనాలివ్వకపోవడంతో తీసుకెళ్లిన ఆపరేటర్లు

ఈనాడు, హైదరాబాద్‌, మెహిదీపట్నం, న్యూస్‌టుడే: గ్రేటర్‌ వ్యాప్తంగా కొవిడ్‌ టీకా కేంద్రాలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ప్రత్యేక టీకా కార్యక్రమంలో భాగంగా అధికారులు నగరవ్యాప్తంగా వందకుపైగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ద్వారా సమకూర్చుకున్న కంప్యూటర్‌ ఆపరేటర్లు ఆయా కేంద్రాలను నడిపించారు. టీకా కేంద్రాలకు వచ్చిన పౌరుల వివరాలను వీరు ల్యాప్‌టాప్‌లోని సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసి వైద్య ఆరోగ్యశాఖకు చేరవేసేవారు. అందుకు గుత్తేదారు వాళ్లకు రోజువారీ డబ్బు చెల్లించాల్సి ఉంది. మూణ్నెళ్లుగా తమకు వేతనం ఇవ్వట్లేదని సిబ్బంది వాపోయారు. అందుకే విధులను బహిష్కరిస్తున్నామని మెహిదీపట్నంలోని ఓ టీకా కేంద్రం సిబ్బంది ఒకరు ‘ఈనాడు’తో తెలిపారు. ఏజెన్సీ నుంచి సరైన స్పందన రాకపోవడంతోనే ల్యాప్‌టాప్‌లు తీసుకెళ్లామని వెల్లడించారు. దీంతో నగరంలోని సుమారు 50 కేంద్రాలు మూతపడ్డాయి. కొన్ని చోట్ల పౌరులు ఇబ్బంది పడకుండా పారిశుద్ధ్య పర్యవేక్షకులను రంగంలోకి దించి కేంద్రాలు నడిపిస్తున్నామని జీహెచ్‌ఎంసీ అధికారి తెలిపారు. ప్రస్తుతం టీకాల సరఫరా తగ్గిందని, అందువల్ల అరకొర కేంద్రాలతోనే నెట్టుకొస్తున్నామన్నారు. ల్యాప్‌టాప్‌లలోని సమాచారం ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉంటుందని, వాటిని తీసుకెళ్లడం వల్ల టీకా కార్యక్రమానికి ఎలాంటి సమస్య లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని