TS News: ఒమిక్రాన్‌పై హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తాం: మంత్రి హరీశ్‌రావు

దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐసీయూ, ఆపరేషన్‌ థియేటర్‌లను తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా

Updated : 23 Dec 2021 18:45 IST

హైదరాబాద్‌: దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐసీయూ, ఆపరేషన్‌ థియేటర్‌లను తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆరోగ్యశ్రీ బిల్లులు ప్రతి నెలా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయుష్మాన్‌ భారత్‌ను ప్రభుత్వ ఆసుపత్రులకే పరిమితం చేశామని, అవకాశం ఉంటే ఈ పథకాన్ని దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్‌ ఆసుపత్రికి విస్తరిస్తామని తెలిపారు. ‘మెగా’ సంస్థ ఆసుపత్రులకోసం రూ.కోట్లు ఖర్చు చేసి ప్రజా సేవ చేస్తోందన్నారు. రూ.18కోట్లతో  నిమ్స్‌లో క్యాన్సర్‌  చికిత్సకు అవసరమైన సదుపాయాలను మెగా సంస్థ కల్పించిందన్నారు. కొవిడ్‌ తీవ్రత ఎక్కుగా ఉన్న సమయంలో రోజుకు 35లక్షల లీటర్ల  ఆక్సిజన్‌ను ప్రభుత్వానికి అందించిందని తెలిపారు.

తెలంగాణలో ఒమిక్రాన్‌ కట్టడికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికీ ఎయిర్‌పోర్టులు టెస్టులు చేస్తున్నామని వెల్లడించారు. బూస్టర్‌ డోస్‌, చిన్న పిల్లల వ్యాక్సినేషన్‌పై కేంద్రం స్పందించడం లేదన్నారు. ఇతర దేశాలు బూస్టర్‌ ఇవ్వాలని చెబుతున్నా... కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో క్రిస్‌మస్, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకలను నియంత్రించాలని, వేడుకల్లో జనం గుమిగూడకుండా ఆంక్షలు విధిస్తూ రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర  ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి హరీశ్‌రావు హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని తెలిపారు. ఇంకా కోర్టు ఆర్డర్‌ కాపీ అందలేదని, వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని