Ts News: ఫ్రాన్స్‌ పర్యటన.. వ్యాపార సంస్థల అధినేతలతో కేటీఆర్‌ బృందం భేటీ

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో పారిస్‌లో రాష్ట్ర ప్రతినిధుల బృందం పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్‌ బృందం

Published : 29 Oct 2021 17:46 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో పారిస్‌లో రాష్ట్ర ప్రతినిధుల బృందం పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్‌ బృందం పలు ఫ్రెంచ్‌ వ్యాపార సంస్థల అధినేతలతో సమావేశమయ్యారు. ఫ్రాన్స్‌లో అతిపెద్ద ఎంప్లాయర్‌ ఫెడరేషన్‌ అయిన మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌ డిప్యూటీ సీఈఓ జెరాల్డిన్‌ లెమ్లేతో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టబడి అవకాశాలను వివరించారు. ఆహార ధాన్యాలు, మాంసం, పాలు, చేపల ఉత్పత్తిలో తెలంగాణ ఇటీవల సాధించిన విజయాలను మంత్రి కేటీఆర్ తెలియజేశారు. అనంతరం పారిస్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ క్యాంపస్ స్టేషన్ ఎఫ్‌ను కేటీఆర్ బృందం పరిశీలించింది. టీ హబ్‌, వీ హబ్‌, టీ వర్క్స్‌ వంటి తెలంగాణ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ సంస్థలతో సహకారం గురించి చర్చించారు. స్టేషన్ ఎఫ్‌ అనేది ప్యారిస్ ఉన్న ఒక ప్రత్యేకమైన క్యాంపస్. కమ్యూనిటీ, 1,000 స్టార్టప్‌లు కేంద్రంగా ఉన్నాయి. వాస్తవానికి రైల్వే డిపోగా ఉన్న ఈ కేంద్రాన్ని ఇంక్యుబేటర్‌గా మార్చారు.

ఏడీపీ ఛైర్మన్, సీఈఓ అగస్టిన్ డి రోమనెట్‌తో కేటీఆర్‌ సమావేశమయారు. ఏడీపీ ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో పెట్టుబడి పెట్టింది. దేశంలో విమానయాన రంగంలో ఉన్న అవకాశాలను కేటీఆర్‌ వారికి వివరించారు. ప్రపంచ ఏరోస్పేస్ కంపెనీలకు హైదరాబాద్ నిలయంగా ఉందన్నారు. ఏరోస్పేస్ రంగానికి నాణ్యమైన సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని వివరించారు. పారిస్‌లోని సనోఫీ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ హెడ్ మిస్టర్ ఫాబ్రిస్ బస్చిరా, గ్లోబల్ వ్యాక్సిన్ పబ్లిక్ అఫైర్స్ హెడ్ ఇసాబెల్లె డెస్చాంప్స్‌ను ప్రతినిధుల బృందం కలిసింది. సనోఫీ త్వరలో హైదరాబాద్ ఫెసిలిటీ నుంచి సిక్స్ ఇన్ వన్ వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని