
KTR: ఒకే చోట 15,660 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు.. అద్భుత దృశ్యం: కేటీఆర్ ట్వీట్
కొల్లూరు: సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రాష్ట్ర ప్రభుత్వం ఒకే చోట 15,660 రెండు పడక గదుల ఇళ్లను నిర్మించింది. వీటికి సంబంధించిన డ్రోన్ చిత్రాలను మంత్రి కేటీ రామారావు ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ఓఆర్‌ఆర్‌కు అతి దగ్గరగా ఇళ్లను నిర్మించామని చెప్పారు. సీఎం కేసీఆర్ త్వరలోనే ఈ ఇళ్లను ప్రారంభిస్తారని తెలిపారు. ఒకే చోట పెద్ద సంఖ్యలో రెండు గదుల ఇళ్లు, చుట్టూ ఆహ్లాదకర వాతావరణం, నిర్మాణాలను ఆనుకొనే వెళ్తున్న రహదారి దృశ్యాన్ని ఆకాశం నుంచి చూస్తుంటే అద్భుతంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.