Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అంబర్‌పేట, మలక్‌పేట

Updated : 26 Aug 2021 18:22 IST

హైదరాబాద్‌: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అంబర్‌పేట, మలక్‌పేట, ఎల్బీనగర్‌, సైదాబాద్‌, వనస్థలిపురం, రామంతాపూర్‌, దిల్‌సుక్‌నగర్‌, బషీర్ బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్​బజార్, అబిడ్స్​, నాంపల్లి, హిమాయత్​నగర్​, లిబర్టీ, లక్డికాపూల్‌, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. సాయంత్రం పలుచోట్ల కురిసిన వర్షాలకు నగరవాసులు తడిసి ముద్దయ్యారు. వర్షం తాకిడిని తట్టుకునేందుకు వాహనదారులు, బాటసారులు చెట్ల కింద తలదాచుకున్నారు. రహదారులపైకి నీరు చేరడంతో వివిధ పనుల కోసం బయటకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని