AP News: ఆ సొమ్ము రికవరీ అయ్యేవరకూ వారికి రేషన్‌, పింఛన్‌ బంద్‌!

సాలూరు మండలం శివరాంపురం గ్రామంలోని కొంతమందికి రేషన్‌, పింఛన్‌ నిలిపివేయాలని అధికారులను స్థానిక తహసీల్దార్‌ ఆదేశించారు.

Published : 08 Dec 2021 11:49 IST

సాలూరు తహసీల్దార్‌ ఆదేశాలు..

సాలూరు గ్రామీణం: విజయనగరం జిల్లా సాలూరు మండలం శివరాంపురం గ్రామంలోని కొంతమందికి రేషన్‌, పింఛన్‌ నిలిపివేయాలని అధికారులను స్థానిక తహసీల్దార్‌ ఆదేశించారు. గత ఏడాది చివరిలో అధికారుల తప్పిదంతో గ్రామంలోని 247 మంది ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమయ్యాయి. అవి తిరిగి వసూలు చేసేందుకు అధికారులు ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. 

వివరాల్లోకి వెళితే.. 2020 డిసెంబర్‌లో మండలంలోని కొదమ పంచాయతీలో లబ్ధిదారులకు పడాల్సిన రైతు భరోసా సొమ్ము రూ.13,500 చొప్పున శివరాంపురం గ్రామంలోని కొంతమంది రైతుల ఖాతాల్లో జమ అయింది. దీన్ని గుర్తించిన రెవెన్యూ అధికారులు అప్పుడే దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. ఆ గ్రామానికి వెళ్లి పొరపాటున ఖాతాల్లో సొమ్ము జమ అయిందని.. వెనక్కి తిరిగి ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే ఈ 11నెలల్లో మొత్తం 247 మందికి గాను 59 మంది మాత్రమే సొమ్ము వెనక్కి తిరిగిచ్చారు. ఇంకా 188 మంది చెల్లించాల్సి ఉంది. వారి నుంచి సొమ్ము రికవరీ చేసేందుకు ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాలు నిలిపివేయాలంటూ తహసీల్దార్‌ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని