KRMB: ‘సాగర్‌’ రెండు కాలువల సామర్థ్యం సమానంగా ఉండాలి.. సరిదిద్దండి: తెలంగాణ

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. తెలంగాణ ఇంజినీర్ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్సీ) మురళీధర్‌ కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు లేఖ రాశారు.

Updated : 29 Sep 2021 20:14 IST

హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. తెలంగాణ ఇంజినీర్ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్సీ) మురళీధర్‌ కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు లేఖ రాశారు. నాగార్జునసాగర్ కాలువల సామర్థ్యంలో అసమతుల్యత సవరించాలని విజ్ఞప్తి చేశారు. 1952 ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల ఒప్పందం ప్రకారమే ఉండాలని ఈఎన్సీ కోరారు. కుడి, ఎడమ కాలువల సామర్థ్యాలు సమానంగా ఉండాలని పేర్కొన్నారు. రెండు కాలువల సామర్థ్యంలో తీవ్రమైన అసమానత ఉందని కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లారు. 510 అడుగుల వద్ద ఎడమ కాలువ సామర్థ్యం 7,899 క్యూసెక్కులైతే.. కుడి కాలువ సామర్థ్యం 24,606 క్యూస్కె్కులుగా ఉందన్నారు. 510 అడుగుల వద్ద  రెండు కాలువల సామర్థ్యం సమానంగా ఉండాలని.. నీటి విడుదల సామర్థ్యాల్లో తేడాలను సరిదిద్దాలని కోరారు. ఏపీలో కుడి కాలువ ఆయకట్టుకు వేరే మార్గాలున్నాయని ఈఎన్సీ లేఖలో పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని