Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ మరో లేఖ

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది.

Updated : 12 Aug 2021 13:40 IST

హైదరాబాద్‌: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్‌ అక్రమంగా జలాలు తరలించకుండా చూడాలని ఈఎస్‌సీ మురళీధర్‌ రాసిన లేఖలో విజ్ఞప్తి చేసింది. అనుమతులు లేని ప్రాజెక్టుల ద్వారా తరలింపును అడ్డుకోవాలని కోరింది. మచ్చుమర్రి ఎత్తిపోతల, మాల్యాల పంపింగ్‌ స్టేషన్‌, బనకచర్ల రెగ్యులేటర్‌ నుంచి నీటి తరలింపు ఆపాలని పేర్కొంది.

ఈ మూడింటి నుంచి కేసీ కెనాల్‌కు నీటిని తరలిస్తున్నారని.. వాస్తవానికి కేసీ కెనాల్‌కు తుంగభద్ర నుంచి నీరు సరఫరా అవుతుందని లేఖలో వివరించింది. శ్రీశైలం నుంచి కృష్ణా జలాలనుఎక్కువ నీటిని వినియోగించుకునేందుకు ఏపీ వివిధ ప్రాజెక్టులను చేపట్టిందని తెలంగాణ ఇప్పటికే బోర్డుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని