AP News: మద్యం ధరలు తగ్గడంతో మందుబాబులు ఏం చేశారంటే?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించడంతో మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తు్న్నారు...

Published : 20 Dec 2021 01:19 IST

ఒంగోలు: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించడంతో మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తు్న్నారు. ఆకాశన్నంటే ధరల కారణంగా మద్యం ప్రియులు అనేక ఇబ్బందులు పడ్డారు. మద్యం ధరలు అందుబాటులోకి తేవడంతో పాటు, అమ్మకాలు పెంచుకోవడంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ధరలు తగ్గిస్తూ తీసుకున్న చర్యలతో మందుబాబుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆదివారం ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మద్యం ప్రియులు ఆనందోత్సాహాలతో ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద పూజలు నిర్వహించారు. మద్యం దుకాణానికి హారతులు ఇచ్చి.. అహో.. ఓహో అంటూ పాటలు పాడారు. ఇది చూసి స్థానికులు నవ్వుకున్నప్పటికీ .. మద్యం ప్రియులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ పలుకుతూ ధన్యవాదాలు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని