Tirumala Brahmotsavam: అశ్వ వాహనంపై కల్కి అవతారంలో శ్రీనివాసుడు

కలియుగ వైకుంఠనాథుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు రాత్రి మలయప్పస్వామి అశ్వ వాహనంపై

Updated : 14 Oct 2021 21:51 IST

తిరుమల: కలియుగ వైకుంఠనాథుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు రాత్రి మలయప్పస్వామి అశ్వ వాహనంపై విహరించారు. శ్రీవారు అశ్వాన్ని అధిరోహించి కల్కి అవతారంలో భక్తులను అనుగ్రహించారు. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వ వాహనంపై కల్కి అవతారంలో వచ్చి దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తాడని చెప్పడమే ఈ వాహన ఉద్దేశం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీరమణ, తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, తితిదే ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ఆలయ కల్యాణ మండపంలోనే వాహనసేవ జరిగింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని